ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎంపీఎం ట్రస్ట్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు
_ప్రజా ఆయుధం దినపత్రిక_
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎంపీఎం ట్రస్ట్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు
ఉత్తమ ఫలితాలతో విద్యా ప్రస్థానంలో ముందంజ… ఎంపీఎం ట్రస్ట్ ఆశయ సాధన
అయినవిల్లి, ఏప్రిల్ 15: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం ఎస్ మూలపాలం లోని ఎంపీఎం ట్రస్ట్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు 2026 ఇంటర్మీడియట్ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచి కళాశాలకు కీర్తి తీసుకువచ్చారు.
ఇంటర్ రెండో సంవత్సరం MPC విభాగంలో కొప్పిశెట్టి శిరీషా, వానపల్లి మౌనికలు చెరో 968/1000 మార్కులు సాధించి ప్రతిభ చాటగా, చిట్టిమేను శేషసోమ్య 937/1000, వట్టూరి చంద్రమణి తేజ 931/1000 మార్కులతో మెరుగైన ఫలితాలు సాధించారు. BiPC విభాగంలో సిహెచ్ జాహ్నవి 945/1000, నేరేడుమిల్లి మహితి 922/1000 మార్కులు సాధించారు. CEC విభాగంలో పి. దుర్గ 844/1000, కే టీవీ కే స్వామి 839/1000 మార్కులు సాధించి మంచి ఫలితాలు నమోదు చేశారు.
ఇంటర్ మొదటి సంవత్సరంలో MPC విభాగంలో నేలమూడి కుసుమ 442/470, అడపా అనంత 414/470, మట్టపర్తి స్రవంతి 412/470, నేలమూడి ప్రసన్న 412/470 మావూరి గీతిక 410/470 మార్కులు సాధించారు. BiPC విభాగంలో బొమ్మిడి మహాలక్ష్మి 410/455, మావూరి శ్రావ్య 396/455 CEC విభాగంలో సిహెచ్ కుమారస్వామి 446/500 చెక్కా లాస్య శ్రీ 414/500 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు.
ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ, విద్యార్థులు సాధించిన ఈ విజయాలు ఎంపీఎం ట్రస్ట్ లక్ష్యాలు, ఆశయాలకు ప్రతిబింబమని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, పట్టుదలతో విద్యార్థులను తీర్చిదిద్దడం తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.
అభ్యాసమే విజయానికి మార్గమని, కష్టపడి చదివితే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయని తెలిపారు.
భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచిస్తూ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
📢 ఇంకా మరిన్ని విద్యా వార్తలు, జాబ్ అప్డేట్స్ కోసం 👇
📲 ప్రజా ఆయుధం మీడియా WhatsApp ఛానల్:
https://whatsapp.com/channel/0029VaAedz6BadmYaSWz3B12
📲 ప్రజా ఆయుధం మీడియా WhatsApp గ్రూప్:
https://chat.whatsapp.com/BrX1qBJm2QA4o159Xg1NM9?mode=gi_t