సత్తెనపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన జర్నలిస్ట్ జ్యోతి
ప్రజా ఆయుధం దినపత్రిక పల్నాడు జిల్లా
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు
సత్తెనపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన జర్నలిస్ట్ జ్యోతి
సత్తెనపల్లి, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి జర్నలిస్ట్ జ్యోతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని, ఆయన చూపిన సమానత్వం, సామాజిక న్యాయం బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.