గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
ప్రజా ఆయుధం దినపత్రిక
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా విగ్రహాలకు నివాళులు
రాజోలు, ఏప్రిల్ 14: రాజోలు నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలకు రాజోలు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యం వహించారు.
మొదటగా మామిడికుదురు సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాజోలు మండలం తాటిపాక, పొదలాడ, రాజోలు, శివకోటి, శివకోటి మట్ల, శివకోటి లాకులు, మేడిచెర్లపాలెం, గుడిమెల్లంక, విశ్వేశ్వరాయపురం ప్రాంతాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు.
అలాగే మలికిపురం ఫూలే-అంబేద్కర్ భవన్, వెంకటేశ్వరస్వామి ఆలయం పరిసరాలు, భూపతివారి పేట, సఖినేటిపల్లి మండలం అంతర్వేది రోడ్ సెంటర్, మూడు తూములు, సమతా కళ్యాణ మండపం వద్ద కూడా కూటమి పార్టీ శ్రేణులతో కలిసి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా స్మరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని, సమానత్వం, సామాజిక న్యాయం సాధనలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత అంబేద్కర్ బాటలో నడిచి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ భూపతిరాజు సాయిబాబా రాజు, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు, పార్టీ పరిశీలకులు చిటికెల రామ్మోహన్ రావు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి గెడ్డం సింహ, గోదావరి డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ బందెల పద్మ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మొల్లేటి శ్రీనివాస్, లంకే శ్రీనివాసరావు, రాజోలు ఎంపీపీ కడలి శ్రీదుర్గ, మండల అధ్యక్షులు బోణం బాబు, అడబాల సాయిబాబా, తాడి సత్యనారాయణ, అనుచూరి సునీత, రామ పురుషోత్తం, చెల్లుబోయిన నాగబాబు, కసుకుర్తి త్రినాధస్వామి, గోనిపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.