ఎక్కడ ఉన్నా భారతీయుడే… అంబేద్కర్ మార్గమే మన మార్గం… జై భీమ్!”
ప్రజా ఆయుధం దినపత్రిక
“ఎక్కడ ఉన్నా భారతీయుడే…
అంబేద్కర్ మార్గమే మన మార్గం… జై భీమ్!”
దోహా (ఖతార్), ఏప్రిల్ 14: డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఖతార్ దేశంలోని దోహా నగరంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ముఖ్యంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని అంబేద్కర్ ఆశయాలను ప్రతిష్టాత్మకంగా చాటిచెప్పారు.
దోహా అంబేద్కర్ జై భీమ్ యూత్ సభ్యులు ఖతార్ కమిటీ ఆధ్వర్యంలో భారత్ స్టేష్టి హోటల్లో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ICBF చైర్మన్, ప్రసాద్, రజిని, శంకర్ గౌడ్, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, జాఫర్ హుసేన్, మధుసూదన్ రెడ్డి, రాజ్ కుమార్ బళ్ళ, మనీష్, హిలాల్ రాజు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారతదేశం గర్వించదగ్గ మహానాయకుడని, దళిత, పీడిత, బహుజన మరియు మహిళా వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అపారమని కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలు సమానత్వం, న్యాయం, స్వేచ్ఛలకు మార్గదర్శకమని పేర్కొన్నారు.
విదేశీ నేలపై కూడా అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించడం భారతీయుల ఐక్యతకు నిదర్శనమని, ముఖ్యంగా కోనసీమ జిల్లా వాసులు తమ మూలాలను మరవకుండా మహానీయుల ఆశయాలను ప్రపంచానికి పరిచయం చేస్తుండటం గర్వకారణమని తెలిపారు.
ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అంబేద్కర్ అభిమానులు హాజరై “జోహార్ డా. బి.ఆర్. అంబేద్కర్”, “జై భీమ్” నినాదాలతో సభా ప్రాంగణాన్ని మార్మోగించారు.