గడియార స్తంభం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు.. కో-ఆర్డినేటర్ డా. పినిపే శ్రీకాంత్ ఘన నివాళులు
ప్రజా ఆయుధం దినపత్రిక
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
గడియార స్తంభం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు.. కో-ఆర్డినేటర్ డా. పినిపే శ్రీకాంత్ ఘన నివాళులు
అమలాపురం, ఏప్రిల్ 14:
అమలాపురం పట్టణంలోని గడియార స్తంభం వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గం కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్, రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రచార విభాగ కార్యదర్శి తిరుకోటి సతీష్, రాష్ట్ర మున్సిపల్ విభాగ సంయుక్త కార్యదర్శి గొవ్వల రాజేష్, దొమ్మేటి రాము తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం వంటి విలువలకు పునాది అని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించారు.