అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామాల్లో ఘన నివాళులు అర్పించిన మాజీ ఎంపీ చింతా అనురాధ
ప్రజా ఆయుధం దినపత్రిక
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామాల్లో ఘన నివాళులు అర్పించిన మాజీ ఎంపీ చింతా అనురాధ
అల్లవరం, ఏప్రిల్ 14:
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అల్లవరం మండలం మొగళ్లమూరు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహాలకు అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కాశీ చిరంజీవి, మద్దా వినోద్ రావు, చింతా భాస్కరరావు, కోరుకొండ చిట్టిబాబు, గూటం సత్యనారాయణ, రొక్కల చిన్ని, రాయడు విష్ణు, చింతా గణేష్, చింతా ప్రసాద్, గోగు కామేష్, కటారి రతన్ రాజు, సాపే సారధి తదితరులు పాల్గొన్నారు.
అలాగే అల్లవరం మండలం శిరగట్లపల్లి గ్రామంలో కూడా నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.