మాల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా
ప్రజా ఆయుధం దినపత్రిక
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
మాల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా
మండపేట, ఏప్రిల్ 14:
మండపేట మాల సంఘం ఆధ్వర్యంలో వాణిమహల్ కరాచీ సెంటర్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సన్మాల ధనరాజు, మాజీ కౌన్సిలర్ కనికెళ్ళ పల్లవి ప్రసాద్, పోలమాల సత్తిబాబు, విప్పర్తి సింహాచలం, సన్మాల వీర్రాజు, మారే రవి తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యువనేత తోట పృథ్వీరాజ్, రెడ్డి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట పృథ్వీరాజ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అమూల్యమని అన్నారు. స్వాతంత్ర్యంతో పాటు బడుగు, బలహీన వర్గాలకు నిజమైన స్వేచ్ఛను అందించిన మహోన్నత నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన జాతి అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని, యువత ఆయన మార్గంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం తోట పృథ్వీరాజ్ 10వ వార్డులో పాలపర్తి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అలాగే 7, 8వ వార్డుల్లో మాజీ కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కూడా పాల్గొన్నారు. 11వ వార్డులోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్, మాజీ చైర్మన్ ప్రతివాడ నూకదుర్గారాణి, మాజీ కౌన్సిలర్ పోతంశేట్టి ప్రసాద్, ముమ్మిడివరపు బాపిరాజు, మరిశెట్టి సత్యనారాయణ, ముక్కా దాలియా, విప్పర్తి సింహాచలం, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్లు ఆలీఖాన్ బాబా, మీగడ శ్రీను, శెట్టి నాగేశ్వరరావు, ఎర్రగుంట అయ్యప్ప, కొడమంచిలి భాస్కరరావు, సాధనాల శివ, దార్ల అబ్రహం, జొన్నపల్లి సత్తిబాబు, మడికి ఆనందరావు, మందపల్లి సుధాకర్ రావు, సూరంపూడి సత్యప్రసాద్, మాజీ సొసైటీ చైర్మన్ పెంకే గంగాధర్, టేకుమూడి శ్రీను, వారా సన్నీ, తాడి రామారావు, అనిల్, కనికెళ్ళ పల్లవి, కొనగళ్ళ భాస్కరరావు, కోణాల చంద్రబోస్, తానాల వెంకన్న, అయినవిల్లి రమణ, శీలి సత్యనారాయణ, తణుకు అశోక్ తదితరులు పాల్గొన్నారు.