డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు
ప్రజా ఆయుధం దినపత్రిక
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు
రావులపాలెం, ఏప్రిల్ 14:
అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి, అస్తిత్వ ఉద్యమాలకు దిశానిర్దేశం చేసిన స్ఫూర్తి ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కలిసి రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కోనసీమ ముఖద్వారం వద్ద జయంతి వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఇందిరా కాలనీ మరియు కొత్తపేట రెడ్డప్పవారి పేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు కూడా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డా. బి.ఆర్. అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.