జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేగుళ్ళ
అంబేద్కర్ ఆలోచనలతోనే ప్రపంచంలో భారత్ ప్రతిష్ట వెలుగొందుతోంది
జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేగుళ్ళ
మండపేట, ఏప్రిల్ 14 (ప్రజా ఆయుధం దినపత్రిక):
స్వేచ్ఛ, సమానత్వాలతో భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవడానికి మహనీయ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషే ప్రధాన కారణమని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు.
అయోధ్య పర్యటనలో ఉన్న ఆయన ఫోన్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ, వందేళ్లకు చేరువవుతున్నా చెక్కుచెదరని రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ లాంటి గొప్ప ఆలోచనా పరుడు ఈ దేశంలో పుట్టడం భారతీయుల అదృష్టమని పేర్కొన్నారు.
నేటి యువత ఆయన ఆలోచనా విధానాలను పుణికిపుచ్చుకుని భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సమాజంలో సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ఆచరణలో పెట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.