ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు , గుత్తులు నివాళులు
ప్రజా ఆయుధం దినపత్రిక
ముమ్మిడివరం కేంద్రంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు , గుత్తులు నివాళులు
ముమ్మిడివరం, ఏప్రిల్ 14:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ప్రధాన కేంద్రంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి తో కలిసి ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు.
ముమ్మిడివరం పార్టీ ప్రధాన కార్యాలయం, కాశి వారి తూము మరియు ఇతర ప్రాంతాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన మార్గంలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఆయన కలలు కనిన ఆశయాలను నెరవేర్చడం మన అందరి కర్తవ్యమని తెలిపారు.
అదేవిధంగా ఈ సందర్భంగా పీఎం అజయ్ ఉన్నతి రుణాల పంపిణీ కార్యక్రమం మరియు డ్వాక్రా అనిమేటర్లకు ప్రభుత్వం పంపించిన మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు మరియు మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.