మహనీయుడు అంబేద్కర్ గౌరవాన్ని కించపరచవద్దు: ఎస్సై జానీ భాషా
ప్రజా ఆయుధం దినపత్రిక
మహనీయుడు అంబేద్కర్ గౌరవాన్ని కించపరచవద్దు: ఎస్సై జానీ భాషా
అమలాపురం నియోజకవర్గం, ఏప్రిల్ 14:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గ పరిధిలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చల్లపల్లి అంబేద్కర్ నగర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ జానీ భాషా మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు మార్గాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలని సూచించారు.
ముఖ్యంగా మోటార్ సైకిళ్లకు సైలెన్సర్లు తీసివేసి అధిక శబ్దాలు చేయవద్దని ఎస్సై జానీ భాషా అవగాహన కల్పించారు. ఇలాంటి చర్యలు ప్రజలకు అసౌకర్యం కలిగించడంతో పాటు అంబేద్కర్ జయంతి వేడుకల గౌరవాన్ని కూడా తగ్గిస్తాయని పేర్కొన్నారు.
అదేవిధంగా వాహనాలను భద్రంగా నడపాలని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అంబేద్కర్ ఆశయాలను గౌరవిస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రవర్తించాలని యువతకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.