బీసీలకు గుర్తింపు ఇచ్చిందే పూలే – పతివాడ నూక దుర్గా రాణి
ప్రజా ఆయుధం దినపత్రిక
బీసీలకు గుర్తింపు ఇచ్చిందే పూలే – పతివాడ నూక దుర్గా రాణి
మండపేట, ఏప్రిల్ 11:
దేశంలో వెనుకబడిన తరగతుల ఉనికిని గుర్తింపులోకి తీసుకువచ్చింది మహాత్మ జ్యోతిరావు పూలే అని మండపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పేర్కొన్నారు.
శనివారం మండపేట పట్టణంలో ఆమె ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద కాలువ వద్ద కరాచీ సెంటర్లో ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బీసీల సామాజిక సంక్షేమానికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. బీసీల ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన మహనీయుడిగా ఆయన నిలిచారని కొనియాడారు.
పూలే చూపిన మార్గంలో బీసీలు ఐక్యంగా ముందుకు సాగాలని, ప్రస్తుత పోటీ సమాజంలో యువత కష్టపడి చదివి ఉన్నత స్థానాలు సాధించాలని సూచించారు. విద్య, సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండపేట పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్, సొసైటీ మాజీ చైర్మన్ పెంకే గంగాధర్, మాజీ కౌన్సిలర్లు మొండి మురళి భవాని, ముక్కా దాలియా, మరిశెట్టి సత్యనారాయణ, షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ ఆలీ ఖాన్ బాబా, బిజెపి నాయకులు కోటిపల్లి సాయిరామ్, గోడవర్తి రామచంద్రరావు, బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు మల్లువలస గణపతి, జాతీయ బీసీ సంఘాల కార్యదర్శి విరమల్లు శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు ధూళి జయరాజు, గాలింకి నాగేశ్వరరావు, చుక్కల అప్పారావు, ఉండ్రసపు అర్జున్ తదితరులు పాల్గొన్నారు.