అంబాజీపేట ప్రెస్ క్లబ్ భవన ప్రారంభోత్సవంలో ఎంపీ హరీష్ బాలయోగి
ప్రజా ఆయుధం దినపత్రిక
అంబాజీపేట ప్రెస్ క్లబ్ భవన ప్రారంభోత్సవంలో ఎంపీ హరీష్ బాలయోగి
అంబాజీపేట, ఏప్రిల్ 11:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేటలో నూతనంగా నిర్మించిన ప్రెస్ క్లబ్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. వారు నూతన భవనాన్ని ప్రారంభించి, పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. నిజాయితీతో వార్తలను ప్రజలకు అందించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మీడియా ముఖ్య భూమిక పోషిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాత్రికేయులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.