రావులపాలెంలో పూలే చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి
ప్రజా ఆయుధం దినపత్రిక
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు
రావులపాలెంలో పూలే చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి
రావులపాలెం, ఏప్రిల్ 11:
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే భారతదేశంలో సామాజిక సమానత్వానికి మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు.
మహిళా విద్యకు శ్రీకారం చుట్టి, అణగారిన వర్గాలకు విద్య అందించేందుకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్తగా పూలే నిలిచారని తెలిపారు. సమాజంలో ఉన్న కుల వివక్ష, అన్యాయాలపై గళమెత్తి పోరాడి సమాన హక్కుల కోసం ప్రజలను చైతన్యపరిచారని అన్నారు.
పూలే ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాత్మునికి ఘన నివాళులు అర్పించారు.
![]()