మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా – ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
ప్రజా ఆయుధం దినపత్రిక
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా – ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
పి. గన్నవరం, ఏప్రిల్ 11:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి, అలాగే డొక్కా సీతమ్మ ఆక్విడిక్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం చేసిన సేవలు అపారమని కొనియాడారు. ఆయన ప్రారంభించిన విద్యా ఉద్యమం సమాజంలో కొత్త వెలుగులు నింపిందని తెలిపారు.
మహిళలకు విద్య అందించడంలో, బాలికల పాఠశాలలు స్థాపించడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని గుర్తుచేశారు.
యువత పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్యను ఆయుధంగా మార్చుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. కుల, మత భేదాలు లేకుండా అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ జీవితాలను అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, జనసైనికులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![]()