అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే – ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు
ప్రజా ఆయుధం దినపత్రిక
అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే – ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు
అమలాపురం, ఏప్రిల్ 11:
అణగారిన వర్గాల విద్యా సాధికారత, సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కొనియాడారు.
శనివారం అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో స్త్రీ విద్యకు, దళితుల అభ్యున్నతికి పూలే వేసిన పునాదులే నేటి సామాజిక స్వేచ్ఛకు కారణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలవడమే మహాత్మా జ్యోతిరావు పూలేకు ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు