ప్రజా దర్బార్లో వినతులు స్వీకరించిన మంత్రి సుభాష్
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా దర్బార్లో వినతులు స్వీకరించిన మంత్రి సుభాష్
రామచంద్రపురం, ఏప్రిల్ 11:
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.
రామచంద్రపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా మంత్రికి తెలియజేశారు. ఇళ్ల స్థలాలు, వృద్ధాప్య పింఛన్లు, దివ్యాంగ పింఛన్లు, కొత్త రేషన్ కార్డుల కోసం మొత్తం 48 వినతిపత్రాలు అందాయి.
ప్రతి అర్జీని శ్రద్ధగా స్వీకరించిన మంత్రి సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం సహించబోమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండటం తన ప్రాథమిక బాధ్యత అని, ప్రతి సమస్యకు పరిష్కారం చూపేందుకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజా దర్బార్ ప్రజలకు నమ్మకాన్ని కలిగించే వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధ్యక్షుడు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, సీనియర్ నాయకుడు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు ఉండవల్లి శివ, రూరల్ మండలాధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనుబాబు, కూటమి నాయకులు, అర్జీదారులు పాల్గొన్నారు.