డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రయాణికుల భద్రత దృష్ట్యా అమలాపురం ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న బస్సులు, పార్సిల్ కౌంటర్ వద్ద ఉన్న అన్ని రకాల పార్సిళ్లను జిల్లా బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బంది శిక్షణ పొందిన డాగ్స్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో అమలాపురం పట్టణ సీఐ పి. వీరబాబు, ఎస్ఐ కే.ఎం జోషి, జిల్లా బాంబ్ డిస్పోజల్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ తరహా తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.