అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్
అమలాపురం, ఏప్రిల్ 08:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లిలంక గ్రామంలో మచ్చ నాగరాజు (శ్రీను) నివాసం కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్దమైంది. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులు నిరాశ్రయులుగా మారారు.
ఈ ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబానికి అండగా ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అయినవిల్లి మండల శాఖ ముందుకు వచ్చి నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నేరేడిమిల్లి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. బంగార్రాజు, మండల ప్రధాన కార్యదర్శి బి. అబ్బులు, జె. భీమారావు, ట్రెజరర్ గుమ్మడి వెంకట్ పాల్గొన్నారు.
అలాగే స్థానిక సర్పంచ్ కుమ్మరి మాధవి, కుమ్మరి రమణ, దాసరి వీరస్వామి తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి తమ వంతు సహాయం అందించారు.