పి. గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలోకి మరో మహిళా నాయకురాలి చేరిక?
పి. గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలోకి మరో మహిళా నాయకురాలి చేరిక?
ప్రజా ఆయుధం దినపత్రిక: అమలాపురం, ఆగస్టు 01: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ జనసేన మహిళా నాయకురాలు యాన్నపు లలిత త్వరలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
పార్టీ అధిష్ఠానం నుంచి సానుకూల సంకేతాలు లభించినట్లు ప్రచారం జరుగుతుండగా, రానున్న శ్రావణ మాసంలో వందలాది మంది కార్యకర్తలు, పలువురు స్థానిక నాయకులతో కలిసి యాన్నపు లలిత కుమారి వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ చేరికపై వైఎస్సార్సీపీ అధిష్ఠానం లేదా యాన్నపు లలిత కుమారి నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అధికారిక ప్రకటన వెలువడిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
![]()