అల్లూరి అడుగుజాడల్లో అభివృద్ధి ల్యాంచ్ప్యాడ్.. విమానాశ్రయాలకు ఒకే కుటుంబం పేర్లు పెట్టలేదు: ప్రధాని మోదీ
📰 ప్రజా ఆయుధం దినపత్రిక
అల్లూరి అడుగుజాడల్లో అభివృద్ధి ల్యాంచ్ప్యాడ్.. విమానాశ్రయాలకు ఒకే కుటుంబం పేర్లు పెట్టలేదు: ప్రధాని మోదీ
ప్రజా ఆయుధం దినపత్రిక: భోగాపురం, ఆగస్టు 1: భోగాపురం నేల వీర విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు అడుగుజాడలు ముద్రించిన పవిత్ర భూమి అని, గిరిజనుల హక్కుల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి నిండిన ఈ నేలపై నేడు అభివృద్ధికి కొత్త ల్యాంచ్ప్యాడ్ ప్రారంభమైందన్నారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన దిశను చూపుతుందని తెలిపారు.
దేశంలో విమానాశ్రయాల పేర్లను ఒకే కుటుంబానికి పరిమితం చేయలేదని ప్రధాని స్పష్టం చేశారు. అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని పేర్కొన్నారు. దేశ చరిత్రలో విశిష్ట సేవలు చేసిన మహనీయుల స్ఫూర్తిని చిరస్థాయిగా నిలబెట్టేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
![]()