దేశంలో ఎయిర్పోర్టుల సంఖ్య 166కు పెరిగింది.. బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తున్నాం: ప్రధాని మోదీ
📰 ప్రజా ఆయుధం దినపత్రిక
దేశంలో ఎయిర్పోర్టుల సంఖ్య 166కు పెరిగింది.. బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తున్నాం: ప్రధాని మోదీ
ప్రజా ఆయుధం దినపత్రిక: భోగాపురం, ఆగస్టు 1: దేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, 2014కు ముందు దేశంలో కేవలం 74 ఎయిర్పోర్టులు మాత్రమే ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 166కు చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాలను కూడా విమాన సేవలతో అనుసంధానం చేయగలిగామని పేర్కొన్నారు.
ఉడాన్ పథకం వల్ల ఎయిర్పోర్టుల సంఖ్య మాత్రమే కాకుండా విమాన ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని ప్రధాని చెప్పారు. దేశంలోని సాధారణ ప్రజలకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని, ప్రాంతీయ అనుసంధానం మరింత బలపడిందని వివరించారు.
కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఇప్పుడు అమృత్సర్ వరకు విస్తరించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా విమానయాన మౌలిక సదుపాయాలను మరింత విస్తరించి అభివృద్ధికి కొత్త దారులు వేస్తున్నామని చెప్పారు.
సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, బ్లూ ఎకానమీని బలోపేతం చేసే దిశగా పలు కీలక చర్యలు చేపడుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. విమానయానం, పోర్టులు, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో భారత ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.
![]()