రాజకీయ ఉనికి కోసమే డీఎస్సీపై వైసీపీ డ్రామాలు: టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ రాజు
రాజకీయ ఉనికి కోసమే డీఎస్సీపై వైసీపీ డ్రామాలు: టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ రాజు
ప్రజా ఆయుధం దినపత్రిక: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, జూలై 28: మెగా డీఎస్సీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 150 రోజుల్లోనే అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తి చేసిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ రాజు పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాలను అడ్డుకోవడానికి వైసీపీ 150కి పైగా కోర్టు కేసులు వేసినప్పటికీ, న్యాయస్థానాలు వాటిని కొట్టివేస్తూ ప్రభుత్వ పారదర్శకతను సమర్థించాయని ఆయన గుర్తు చేశారు. ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయకుండా, జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అమలవుతున్న విద్యా సంస్కరణలను ఓర్వలేకే వైసీపీ నేతలు అమలాపురంలో నిరసనల పేరుతో రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. డీఎస్సీ అంశంపై బహిరంగ చర్చకు రావాలంటూ మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేకనే వైసీపీ నేతలు చౌకబారు విమర్శలకు దిగుతున్నారని అన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అడ్డుకునే కుట్రలను రాష్ట్ర యువత గమనిస్తోందని, వాస్తవాలను ప్రజలు గుర్తిస్తున్నారని నక్కా సునీల్ రాజు పేర్కొన్నారు.
![]()