పెన్ షాట్ రిపోర్టర్ రాంబాబును పరామర్శించిన జిల్లా రిపోర్టర్స్ సంఘం అధ్యక్షుడు పెంట నాగ శ్రీనివాస్
ప్రజా ఆయుధం దినపత్రిక
పెన్ షాట్ రిపోర్టర్ రాంబాబును పరామర్శించిన జిల్లా రిపోర్టర్స్ సంఘం అధ్యక్షుడు పెంట నాగ శ్రీనివాస్
ప్రజా ఆయుధం, అమలాపురం, జూన్ 13:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పెన్ షాట్ ప్రతినిధి గుర్రం రాంబాబు మాతృమూర్తి గుర్రం గణపతి ఇటీవల స్వర్గస్తులైన సందర్భంగా జిల్లా రిపోర్టర్స్ సంఘం అధ్యక్షుడు పెంట నాగ శ్రీనివాస్ శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిని కోల్పోవడం కుటుంబానికి తీరని లోటని, ఆ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. గుర్రం గణపతి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రాంబాబును పరామర్శించారు.
- ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సలాది పుల్లయ్య నాయుడు, రాష్ట్ర సర్పంచుల సమాఖ్య కార్యదర్శి, మాజీ సర్పంచ్ సలాది బుచ్చిరాజు, మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి అంజిబాబు, మాజీ ఉప సర్పంచ్ అడపా మోహనరావు, మిందగుదటి బాబి, గిడుగు వెంకట సత్యనారాయణమూర్తి, రిపోర్టర్లు సూరపరెడ్డి శ్రీరామమూర్తి (శ్రీరామ్), కె.వి. రామారావు, సత్తి ప్రసాద్, ఆంధ్రప్రభ రిపోర్టర్ కోరపు మురళి, కూర్మా వెంకటపతి తదితరులు పాల్గొన్నారు.
- అలాగే గ్రామ పెద్దలు, స్నేహితులు, బంధువులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కీర్తిశేషులు గుర్రం గణపతికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ప్రతి అక్షరం ప్రజా ఆయుధం
అధికారిక వాట్సాప్ ఛానల్:
https://whatsapp.com/channel/0029VaAedz6BadmYaSWz3B12
ప్రజా ఆయుధం వాట్సాప్ గ్రూప్:
https://chat.whatsapp.com/BrX1qBJm2QA4o159Xg1NM9?mode=gi_t
![]()