టీబీ నివారణే లక్ష్యంగా శానపల్లిలంకలో ప్రత్యేక వైద్య శిబిరం
ప్రజా ఆయుధం దినపత్రిక
టీబీ నివారణే లక్ష్యంగా శానపల్లిలంకలో ప్రత్యేక వైద్య శిబిరం
ప్రజా ఆయుధం అయినవిల్లి, మే 13, 2026:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అయినవిల్లి మండలం శానపల్లిలంక హెల్త్ & వెల్నెస్ సెంటర్లో TB ముక్త్ భారత్ 2.0 శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రెండు వారాలకు పైగా దగ్గు, బలహీనత వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అనుమానితులకు ఛాతీ ఎక్స్రే పరీక్షలు చేపట్టారు.
ప్రజల్లో క్షయ వ్యాధిపై అవగాహన పెంచడం, ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని వైద్య సిబ్బంది తెలిపారు.
అలాగే టీబీ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సూపర్వైజర్ శ్రీనివాస్, సీహెచ్ఓ/ఎంఎల్హెచ్పీ ఈ. శిరీష, ఏఎన్ఎమ్ జె. ముని కుమారి, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ మురళి, ఆశా కార్యకర్తలు, టెక్నీషియన్లు చక్రధర్ మరియు వాణి పాల్గొన్నారు.
![]()