పేదల ఆర్థికాభివృద్ధికి బలం… ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు పంపిణీ
డిజిటల్ శక్తితో సంక్షేమానికి ఊపు… VOAలకు 5G ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆనందరావు
పేదల ఆర్థికాభివృద్ధికి బలం… ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు పంపిణీ
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం అమలాపురం, ఏప్రిల్ 28:
పేదరిక నిర్మూలన, అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తెలిపారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ఆధ్వర్యంలో గ్రామైక్య సంఘ సహాయకులకు (VOA) 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీతో పాటు సబ్సిడీ రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని 154 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు ఆధునిక 5G మొబైల్ ఫోన్లను అందజేయడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలు, డేటా నమోదు మరింత వేగవంతం అవుతుందని తెలిపారు.
మహిళా సాధికారతకు స్వర్గీయ నందమూరి తారక రామారావు పునాది వేయగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా వ్యవస్థ ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశారని గుర్తుచేశారు. ఆ పునాది వల్లే నేడు మహిళా సంఘాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
అనంతరం ట్రైకార్ (TRICOR) మరియు ఇతర పథకాల కింద ఎంపికైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు స్వయం ఉపాధి కోసం 47 మందికి రూ.52.50 లక్షల PM AJAY సబ్సిడీ రుణాలను పంపిణీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు, బలహీన వర్గాల ఆర్థిక ఎదుగుదల కోసం కట్టుబడి ఉన్నాయని తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
![]()