బిజినపల్లిలో టిబి పరీక్షల శిబిరం – ప్రజలకు ఉచిత వైద్య సేవలు
ప్రజా ఆయుధం దినపత్రిక
బిజినపల్లిలో టిబి పరీక్షల శిబిరం – ప్రజలకు ఉచిత వైద్య సేవలు
ప్రజా ఆయుధం నాగర్కర్నూల్, ఏప్రిల్ 26: నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని గ్రామ ప్రజల కోసం ఈ నెల 27వ తేదీన బిజినపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్సీ)లో క్షయ వ్యాధి గుర్తింపు శిబిరం నిర్వహించనున్నట్టు వైద్య అధికారులు తెలిపారు.
ఈ శిబిరంలో 14 ఏళ్ల పైబడిన వారందరికీ ఎక్స్రే పరీక్షలు చేయనున్నారు. ఎవరికైనా టిబి లక్షణాలు ఉంటే మరిన్ని పరీక్షలు చేసి, అవసరమైన మందులు కూడా ఇస్తామని తెలిపారు. ఖరీదైన ఎక్స్రేలు, ఇతర పరీక్షలు ఉచితంగానే చేస్తున్నందున ప్రజలు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని కోరుతున్నారు.
శిబిరానికి వచ్చేవాళ్లు తమతో పాటు ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో ఎవరికైనా దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
![]()