సజ్జల టెలీకాన్ఫరెన్స్‌లో వైసీపీ నేతల అసంతృప్తి – రెండు జిల్లాల్లో నిరసనలు
సజ్జల టెలీకాన్ఫరెన్స్‌లో వైసీపీ నేతల అసంతృప్తి – రెండు జిల్లాల్లో నిరసనలు
అమరావతి | ఏప్రిల్ 3, 2026 | ప్రజా ఆయుధం దినపత్రిక
వైఎస్సార్సీపీ కీలక నేత సజ్జల నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘మావిగన్ రాజధాని’ అంశంపై పార్టీ లైన్‌కు కట్టుబడి ప్రచారం చేయాలని సజ్జల సూచించగా, ఆ సూచనలపై పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
సజ్జల ఇచ్చిన సూచనలు, ఆదేశాలపై గుంటూరు జిల్లా నేతలు, కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ‘మావిగన్’ అనే పేరుతో ఇచ్చిన ప్రకటన ఎవరికీ అర్థంకాకుండా ఉండడంతో పార్టీని, క్యాడర్‌ను డిఫెన్స్‌లోకి నెట్టారని గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే విమర్శించారు.
అదేవిధంగా, ‘మావిగన్’ పేరుతో ప్రకటన ఎవరిని సంప్రదించి చేశారని కృష్ణా జిల్లా మాజీ మంత్రి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విషయంపై పార్టీ అధ్యక్షుడితో సమావేశం ఏర్పాటు చేస్తే పూర్తి వివరాలు చెబుతామని, మంచి-చెడులు చర్చించుకుంటామని జిల్లాల నేతలు సూచించారు.
ఈ నేపథ్యంలో సజ్జల స్పందిస్తూ “చెప్పింది చేయడమే నా పని… ఆపై మీ ఇష్టం” అంటూ టెలీకాన్ఫరెన్స్‌ను ముగించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.