మురమళ్లలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఘనం
ప్రజా ఆయుధం దినపత్రిక
మురమళ్లలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఘనం
మురమళ్ల, ఏప్రిల్ 11:
మురమళ్ల శాసనసభ్యుల కార్యాలయంలో మహానుభావుడు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. విద్య, సమానత్వం, మహిళా సాధికారత కోసం ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు.
ప్రతి ఒక్కరికీ విద్య అందాలి, సమాజంలో ప్రతి వ్యక్తికి సమాన హక్కులు ఉండాలనే ఆయన ఆశయాలు నేటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు అందరూ కృషి చేయాలని, యువత ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.
జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్,మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పాల్గొన్నారు.